తెలంగాణ

Intermediate : కాలేజీల్లో 9, 10 తరగతులు.. సర్కార్ కొత్తప్రతిపాదన?

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డ్రపౌట్స్ తగ్గించేందుకు 10+2 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదిలాఉండగా, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేందుకే అని తాజాగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే ఇంటర్ బోర్డును విలీనం చేశారని.. 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించాలని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసిందని ప్రచారం జరుగుతోంది. పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డును విలీనం చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.