తెలంగాణ

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు.. ఎల్లుండి కొత్త ఇన్‌చార్జితో భేటీ!

 తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ (AICC) అధిష్ఠానం నుంచి ముఖ్యమైన ఆదేశాలు అందాయి. ఈ నెల 23వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో ప్రత్యేకంగా సమావేశం కావాలని హైకమాండ్ సూచించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ స్వయంగా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి అధిష్ఠానం సందేశాన్ని చేరవేశారు.  ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.