National
Delimitation: చట్టసభల స్థానాల 50శాతం పెంపు.. ప్రజాస్వామ్య అవసరమేనా? ప్రయోజనం ఎవరికి?
దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాలను ఒకేసారి 50 శాతం మేర పెంచే అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ప్రతిపాదనపై విశ్లేషకులు, ప్రతిపక్షాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచడం ఎవరికి ప్రయోజనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య అవసరమని మరికొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం దేశ ఖజానాపై ఆర్థిక భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు.
