తెలంగాణ
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు నిరసన సెగ
Jupally Krishna Rao: మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు మత్స్యకారుల నుంచి నిరసన ఎదురైంది. మత్స్యకారులను రెండు వర్గాలుగా విడదీసి వేడుకలు నిర్వహిస్తారా? అంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు మత్స్యకారులు. అసలేం జరిగిందంటే.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి జూపల్లి. అంతకుముందే కల్వకోల్లో తన అనుచర మత్స్యకారులతో మరో సభ నిర్వహించారాయన.
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ సభా వేదికపైకి చేరుకోగానే మత్స్యకారులు నిరసనకు దిగారు. దీంతో సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. మమ్మల్ని విభజించి వేర్వేరు సభలు నిర్వహిస్తారా? అంటూ మత్స్యకారులు మండిపడ్డారు. మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు సభ నుంచి వెళ్లిపోయారు.
