వ్యాపారం

Gold Price Nov 23: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు(నవంబర్ 23) ధరలు ఇవే!

గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు సోమవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.1,26,450గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర, సోమవారం నాటికి రూ.2,091 పెరిగి రూ.1,28,541 మార్కుకు చేరుకుంది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,583.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.