వ్యాపారం

Gold price today nov28: పసిడి, వెండి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు.. తాజా రేట్లు ఇవే!

 దేశీయ బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 28) బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువతో పాటు డిమాండ్-సరఫరా పరిస్థితులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,28,461 వద్ద కొనసాగగా, శనివారం ఏకంగా రూ.1,509 పెరిగి రూ.1,29,970 మార్కుకు చేరింది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,700 గా నమోదైంది.