Health

Winter Foods: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే 10 ఆహార పదార్థాలు ఇవే!

చలి తీవ్రత పెరుగుతున్న వేళ గుడ్లు, వేరుశెనగ, నువ్వులు, బాదం-వాల్‌నట్స్ వంటి ప్రోటీన్ సమృద్ధి ఉన్న ఆహారాలతో పాటు రాగులు, చిలగడదుంప, అల్లం, బెల్లం, నెయ్యి, మిరియాలు, దాల్చినచెక్కలను మితంగా చేర్చుకోవడం వల్ల జీవక్రియ చురుగ్గా మారి శరీరానికి సహజమైన వేడి, బలం, రోగనిరోధక శక్తి లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం అల్పాహారంలో గుడ్లు, రాగులు, నానబెట్టిన నట్స్, మధ్యాహ్న-రాత్రి భోజనంలో నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, సాయంత్రం వేళ చిలగడదుంప లేదా పల్లీ-నువ్వుల పదార్థాలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి రోజంతా శక్తి నిలుస్తుందని, అయితే మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు తీపి పదార్థాల విషయంలో వైద్యుల సలహా పాటించాలని సూచించారు.