క్రైమ్

ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం..ఇంధన ట్యాంకర్ పేలి 30 మంది సజీవ దహనం!

 ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డుపై ఇంధన ట్యాంకర్ (Fuel Tanker) ప్రమాదానికి గురై పేలిపోవడంతో 30 మంది వరకు సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, మంటల తీవ్రతకు రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రేటర్ కైరో పరిధిలోని గిజా (Giza) ప్రాంతంలో జనసంచారం ఎక్కువగా ఉండే అల్-వరాక్ (Al-Warraq) సమీపంలోని రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ఢీకొన్న వెంటనే ఇంధనం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.