తెలంగాణ

TG: హైదరాబాద్‌లో నీటి కొరత లేదంట.. ఉత్తమ్‌ కుమార్‌పై దారుణమైన ట్రోల్స్

TG: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని పేర్కొన్నారు. అయితే, నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు నగరంలో నీటి కొరత లేదని చెబుతుంటే, మరోవైపు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.