తెలంగాణ

TG: హైదరాబాద్‌లో నీటి కొరత లేదంట.. ఉత్తమ్‌ కుమార్‌పై దారుణమైన ట్రోల్స్

4 నిమిషాల పఠనం

TG: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని పేర్కొన్నారు.

TG: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని పేర్కొన్నారు. అయితే, నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

జలమండలి ప్రకటనలకు, మంత్రి మాటలకు పొంతన లేదంటున్న నెటిజన్లు..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు నగరంలో నీటి కొరత లేదని చెబుతుంటే, మరోవైపు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ నుంచే నగరంలో నీటి సరఫరాపై ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, కేపీహెచ్‌బీ, కోకాపేట, పటాన్‌చెరు తదితర ఏరియాల్లో 80 శాతం మేర నల్లా కనెక్షన్లను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్న వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

హాస్టళ్లు ఖాళీ.. ఆన్‌లైన్ క్లాసుల బాటలో కాలేజీలు

నగరంలోని అనేక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ నీటి సరఫరా ఐదు రోజులకొకసారి కూడా సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత కారణంగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నీటి కొరత దృష్ట్యా పలు విద్యాసంస్థలు, కాలేజీలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులకు మారినట్లు పలువురు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు నీళ్ల కోసం ఇంతగా ఇబ్బంది పడుతుంటే, మంత్రి మాత్రం నీటి కొరత లేదని చెప్పడం ఏంటని రాజకీయ నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, తక్షణమే హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

#Hyderabad Water Shortage#Uttam Kumar Reddy#Telangana News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి