తెలంగాణ

TG: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కబ్జా కలకలం.. మేఘా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా!

TG: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కబ్జా కలకలం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో, మేఘా సంస్థ ప్రతినిధులు నేరుగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 పరిధిలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం ప్రస్తుతం మేఘా సంస్థ ఆధీనంలో ఉంది. అయితే, ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి అక్రమంగా నిర్మాణాలు మొదలుపెట్టారు. రూల్స్‌కి విరుద్ధంగా జరుగుతున్న ఈ పనులను గుర్తించిన మేఘా సంస్థ ప్రతినిధులు వెంటనే అలర్ట్ అయ్యారు.