తెలంగాణ
భూగర్భ జలాలు ఎలా పెంచుదాం? శాస్త్రవేత్తలతో హైడ్రా కమిషనర్ చర్చ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైంటిస్టులతో కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలను పెంపొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరదలు నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? తదితర అంశాలపై సంబంధిత శాఖల శాస్త్రవేత్తలతో హైడ్రా కమిషనర్ చర్చించారు. హైడ్రా కార్యాలయం వేదికగా ఈ చర్చా కార్యక్రమం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), తెలంగాణ గ్రౌండ్ వాటర్ శాఖ, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD), తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)కి చెందిన పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
