TG: ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్‌కు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు! హైదరాబాద్‌కు క్యూ కట్టనున్న 1,059 కంపెనీలు..
TG: తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మెగా సదస్సుకు దేశవిదేశాల నుంచి ఏకంగా 1,059 దిగ్గజ కంపెనీలు తరలివస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణంలో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తుండటమే ప్రభుత్వం దీనికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.హైదరాబాద్‌కు క్యూ కడుతున్న 1,059 కంపెనీలు తమ సరికొత్త ఉత్పత్తులు, సాంకేతికతను ప్రదర్శించేందుకు భారీ ఎత్తున స్టాళ్లు సిద్ధమవుతున్నాయి. ఈ భారీ కార్యక్రమానికి తగ్గట్టుగానే ప్రధాన సదస్సు వేదికను ఏకంగా 10 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
