National

Iran Crisis: అవయవాలు అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు.. కనికరం లేదా ట్రంప్?

Iran Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కఠిన ఆంక్షలు, యుద్ధ వాతావరణం ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. అగ్రరాజ్యం అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. పాలకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు సామాన్య ప్రజలు నిలువునా బలవుతున్నారు. చివరికి పూట గడవక, పెరిగిపోయిన అప్పులు తీర్చుకోలేక ఇరాన్ ప్రజలు సొంత శరీర భాగాలనే అమ్ముకునే దుస్థితికి దిగజారారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ, చివరికి వృషణాలను సైతం అమ్మకానికి పెడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఇరాన్ వార్తా సంస్థ 'ఇల్నా' ఈ కన్నీటి గాథలను బయటపెట్టింది.