చిత్రం లేదు
తెలంగాణKA Paul: రేవంత్ పాలనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. భారత్ సమ్మిట్ విందులపై ఘాటు విమర్శలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఏడుగురు అన్నదమ్ములు కలిసి రాష్ట్రంలోని ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయల మేర దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో రూ.50లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకోవడానికి అధికారికంగా లైసెన్స్ ఇచ్చినట్లయిందని కేఏ పాల్ తీవ్రంగా విమర్శించారు.
