తెలంగాణ
TG: రేవంత్ రెడ్డి రూ.10 లక్షల కోట్ల భూములు దోచుకున్నాడు: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేగింది. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి రూ.10 లక్షల కోట్ల భూములను దోచుకున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన లిటిగేషన్లను తొలగించి, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి రేవంత్ రెడ్డి సోదరులు వాటిని దోచుకుంటున్నారన్నది రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రధాన ఆరోపణ. ఈ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కి్ల్స్‌లో సెన్సేషన్‌గా మారాయి.
