ఏపీ
KonaseemaGasLeak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) సీఎన్జీ గ్యాస్ పైప్లైన్ నుంచి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎత్తున గ్యాస్ లీకైంది. భూమి కంపించినట్లుగా భారీ శబ్దాలతో గ్యాస్ ఎగసిపడటంతో నగరం, గెద్దాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఊరంతా దట్టంగా గ్యాస్ వాసన వ్యాపించడంతో ఏ క్షణాన ఏ పెను ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు.
