తెలంగాణ
TG: కృష్ణా జలాలపై నల్గొండలో కేటీఆర్ సభ.. తేదీలు ప్రకటించిన జగదీశ్ రెడ్డి
TG: తెలంగాణ రాజకీయాల్లో కృష్ణా జలాల అంశం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా రైతులకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 10వ తేదీన జిల్లా కేంద్రంలో ‘నల్గొండ నగారా’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. కృష్ణా నదీ జలాల వాటా సాధనలో, ప్రాజెక్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ ఈ సభ ద్వారా ప్రశ్నించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో ప్రభుత్వం సరైన చొరవ చూపడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు.
