తెలంగాణ

BRS : పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ!

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది.తన వాయిస్ శాంపిల్ ఇవ్వాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. 2026 ప్రారంభంలో నాటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ గౌస్ ఆలంను మతపరంగా దూషించారన్న ఫిర్యాదు మేరకు వీణవంక పీఎస్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆడియో ఆధారాలను ధృవీకరించేందుకు వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, దానిని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నేర దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్స్ కోరడం, సేకరించడం సహజమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.