National : భారత సైన్యానికి భారీ ముప్పు : ఎయిర్ ఫోర్స్ చీఫ్ అశుతోష్
భారత దేశానికి సమీప భవిష్యత్లో భారీ ముప్పు పొంచి ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రహస్యల కోసం విదేశీ శక్తులు హానీ ట్రాప్ వలలు విసురుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, హనీట్రాప్ కంటే సైబర్ గూఢచర్యం నుంచే మరింత ముప్పు ఉందన్నారు. హనీ ట్రాప్ విసరడం శత్రుదేశాల గూఢచర్య వ్యూహంలో చిన్న భాగం మాత్రమేనని తెలిపారు. దీనివెనుక సైబర్ వార్ఫేర్, ఆర్థిక మోసాలతో కూడిన పెద్ద స్పై ఆపరేషన్ ఉందని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 'ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0'లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగమే లక్ష్యంగా విదేశీ గూఢచర్య సంస్థలు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అందుకు సైన్యం, రక్షణ పరిశోధన సంస్థలు పటిష్టమైన సాంకేతిక, సంస్థాగత రక్షణ కవచాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.
