తెలంగాణ

అలంపూర్ ఆలయాల్లో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

Seethakka: అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు.

ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు అర్చకులు పూర్ణకంభంతో, మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను గురించి ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు.