తెలంగాణ

Aarogyasri: పేరుకుపోతున్న ఆరోగ్యశ్రీ బకాయిలు.. సర్జరీలు బంద్!

తెలంగాణలో దయనీయ పరిస్థితుల్లో వైద్యవ్యవస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోతున్నట్టు తెలిసింది. నిధులు లేక ఆస్పత్రి నిర్వాహణ కష్టతరంగా మారుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో సుమారు రూ.800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, రెగ్యులర్‌గా వచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఇప్పటికే సర్జరీలు బంద్ చేసినట్టు తెలుస్తోంది.ప్రభుత్వం పట్టించుకోక, సమయానికి నిధులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణకు సూపరింటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ నిధులతో పాటు, రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని సూపరింటెండెంట్లు వెల్లడించారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల పరిధిలోని 35 బోధనాస్పత్రులు, మరో 12 ప్రభుత్వ ఆసుపత్రులు, టీవీవీపీ పరిధిలోని 180కి పైగా ఆసుపత్రుల్లో మూడేళ్లుగా ఆరోగ్య శ్రీ నిధులు రాలేదని,ఫలితంగా శస్త్రచికిత్సలు నిలిపివేసినట్టు సమాచారం.