క్రీడలు
జట్టు ఓడినప్పుడు నా సెంచరీకి విలువ లేదు: కెప్టెన్ తిలక్ వర్మ ఆవేదన!
ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక గ్రూప్-బి పోరులో పాకిస్థాన్ షాహీన్స్ చేతిలో భారత్ ‘ఏ’ జట్టుకు ఓటమి ఎదురైంది. కెప్టెన్ తిలక్ వర్మ(149 బంతుల్లో 100 పరుగులు) అద్భుత శతకంతో చివరి వరకు ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. పాకిస్థాన్ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 49.1 ఓవర్లలో 265 పరుగులకే పరిమితమై 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
