తెలంగాణ
Teachers : లీవ్ కావాలా? అటెండెన్స్ 95% ఉండాల్సిందే : హైదరాబాద్ కలెక్టర్
ఉపాధ్యాయుల సెలవుల విషయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సెలవులు కావాలంటే విద్యార్థుల హాజరు శాతం 95 శాతం ఉండాలని, లేదంటే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అది కూడా అడిషనల్ కలెక్టర్ దగ్గర అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది.హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి లీవ్ లెటర్ ఇచ్చి మంజూరు చేయించుకోవడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
