తెలంగాణ

Teachers : లీవ్ కావాలా? అటెండెన్స్ 95% ఉండాల్సిందే : హైదరాబాద్ కలెక్టర్

4 నిమిషాల పఠనం

ఉపాధ్యాయుల సెలవుల విషయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సెలవులు కావాలంటే విద్యార్థుల హాజరు శాతం 95 శాతం ఉండాలని, లేదంటే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం.

ఉపాధ్యాయుల సెలవుల విషయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సెలవులు కావాలంటే విద్యార్థుల హాజరు శాతం 95 శాతం ఉండాలని, లేదంటే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అది కూడా అడిషనల్ కలెక్టర్ దగ్గర అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది.

హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి లీవ్ లెటర్ ఇచ్చి మంజూరు చేయించుకోవడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, రాష్ట్రంలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలలను సందర్శించడంతో పాటు ఉపాధ్యాయుల అటెండెన్స్ పరిశీలించాలని, విద్యార్థుల హాజరుశాతం పెంపుపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్లు, అధికారులు లీవ్ కావాలంటే అడిషనల్ కలెక్టర్ ద్వారా మంజూరు చేయించుకోవాలని, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ 95% దాటితేనే లీవ్ మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై తీవ్ర జిల్లా వ్యాప్తంగా ఉన్న 672 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 6,200 మంది ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉంటారని, వారికి వివిధ పండుగలు ఉంటాయని, ఒకరిద్దరు తరచూ స్కూలుకు రాకపోయినా 95% అటెండెన్స్ రావడం కష్టమని చెబుతున్నారు. అలాంటప్పుడు 95శాతం హాజరు శాతం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. తమ సెలవులకు, విద్యార్థుల హాజరుశాతానికి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు.

#teachers#leave#additional collecter permision#hyderabad collecter priyanka#telangana#students attendance#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి