Health

Parenting Tips Telugu: పిల్లలపై ఈ 4 వేళల్లో అస్సలు అరవకండి.. వైద్యుల కీలక సూచనలు!

నేటి ఆధునిక జీవనశైలిలో ఉద్యోగ బాధ్యతలు, రోజువారీ ఒత్తిళ్ల కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై చిన్నచిన్న విషయాలకే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే, చిన్నారుల మానసిక ప్రశాంతత దెబ్బతినకుండా ఉండాలంటే రోజులోని కొన్ని అత్యంత కీలక సమయాల్లో వారిపై అస్సలు అరవకూడదని మానసిక వైద్య నిపుణులు, పేరెంటింగ్ కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఉదయం నిద్రలేచిన వెంటనే వారిపై కోప్పడటం లేదా గట్టిగా అరవడం వల్ల ఆ రోజంతా వారి మానసిక స్థితి (మూడ్) దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజు ప్రారంభంలోనే ప్రతికూల వాతావరణం ఎదురైతే చిన్నారుల్లో ఆందోళన, చిరాకు పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండలేరని వివరిస్తున్నారు.   అదేవిధంగా పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో వారిని తిట్టడం లేదా కోపగించుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.