తెలంగాణ
PM Fasal Bima Yojana: ఎల్‌నినోతో పంటనష్టపోయారా.. వాట్సాప్‌లోనే సింపుల్ గా అప్లై చేసుకోండి..
PM Fasal Bima Yojana: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, తుఫాన్లు, చీడపురుగుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, చాలామంది రైతులకు పంట నష్టపోయాక ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కేవలం తమ ఫోన్లోని వాట్సాప్ ద్వారానే నిమిషాల్లో పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునే అద్భుతమైన సౌకర్యం ఉందన్న విషయం తెలియదు.పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం, రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటలకు బీమా రక్షణ కల్పిస్తోంది. తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, కరువు, భూకంపాలు, చీడపురుగులు లేదా జంతువుల దాడి వల్ల పంట దెబ్బతింటే ఈ స్కీమ్ కింద వెంటనే నష్టపరిహారం అందుతుంది.
