Spirituality
SabarimalaMandalaPooja: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. రద్దీ నియంత్రణకు ఏఐ నిఘా!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం.. వృశ్చిక మాసం తొలిరోజైన మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకుడు(మేల్శాంతి) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అదే సమయంలో మాలికప్పురం అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్ నంబూద్రి తెరిచారు.
