ఆధ్యాత్మికత

SabarimalaMandalaPooja: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. రద్దీ నియంత్రణకు ఏఐ నిఘా!

5 నిమిషాల పఠనం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం.. వృశ్చిక మాసం తొలిరోజైన మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకుడు(మేల్శాంతి) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభించారు.

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం.. వృశ్చిక మాసం తొలిరోజైన మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకుడు(మేల్శాంతి) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అదే సమయంలో మాలికప్పురం అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్ నంబూద్రి తెరిచారు.

 'స్వామియే శరణం అయ్యప్ప' శరణుఘోషలతో శబరిగిరులు మార్మోగుతుండగా, తొలిరోజే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభ రోజుల్లోనే భారీ సంఖ్యలో యాత్రికులు తరలివస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) అంచనా వేసింది. రోజుకు గరిష్టంగా 80వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

 ఇందులో భాగంగా వర్చువల్ క్యూ విధానంలో ఇప్పటికే 66వేల మంది ముందస్తు నమోదు చేసుకోగా, మరో 14వేల మందికి స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 18 పవిత్ర మెట్ల (పదునెట్టాంబడి) వద్ద నిమిషానికి సుమారు 75మంది భక్తులు పైకి ఎక్కేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ టికెట్లు లేని వారి కోసం నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సమీపంలోని సత్రం వద్ద స్పాట్ బుకింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.

 అయితే, పంపా నదీ తీరంలో రద్దీ పెరగకుండా ఉండేందుకు అక్కడ స్పాట్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేవస్థానం బోర్డు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. నీలక్కల్ వాహనాల పార్కింగ్ ప్రాంతం నుంచి సన్నిధానం వరకు భక్తుల కదలికలను అంచనా వేసేందుకు కృత్రిమ మేధ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు టీడీబీ అధ్యక్షుడు కే. జయకుమార్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీటి వసతులను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

 దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ తీర్థయాత్రలో భాగంగా డిసెంబర్ 27న నిర్వహించే మండల పూజతో తొలి విడత యాత్ర ముగిసి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు మహోత్సవాల కోసం ఆలయ తలుపులను తెరుస్తారు. జనవరి 14న అత్యంత వైభవంగా మకరవిళక్కు, మకరజ్యోతి దర్శనం జరగనుండగా, జనవరి 19 వరకు భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పించి, జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.

#SabarimalaMandalaPooja2026#AyyappaDevoteesRushSabarimala#SabarimalaVirtualQueueSpotBooking#AICamerasSabarimalaCrowdControl#DevotionalNewsTelugu#KeralaNewsTelugu#HydNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి