No salaries : ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నెలలుగా జీతాలు బంద్!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. టీచర్లు, ఆయాలకు స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే జీతాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ ఏడాది 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలలో రూ.8 వేల జీతంతో ఒక బోధకుడు, రూ.6 వేల జీతంతో ఒక ఆయాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని నియమించి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క నెల జీతం కూడా రాలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఎప్పటికైనా డబ్బులు రాకపోతాయా? అని కొన్ని నెలల పాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారికి స్వయంగా జీతాలు చెల్లించినట్టు తెలిసింది.
