తెలంగాణ

No salaries : ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నెలలుగా జీతాలు బంద్!

4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. టీచర్లు, ఆయాలకు స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే జీతాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ ఏడాది 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలలో రూ.8 వేల జీతంతో ఒక బోధకుడు, రూ.6 వేల జీతంతో ఒక ఆయాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని నియమించి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క నెల జీతం కూడా రాలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఎప్పటికైనా డబ్బులు రాకపోతాయా? అని కొన్ని నెలల పాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారికి స్వయంగా జీతాలు చెల్లించినట్టు తెలిసింది.

ఇన్ని నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించపోవడంతో భోదనపై టీచర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగులో ఉన్న 5 నెలల జీతాన్ని చెల్లించాలని ప్రీ ప్రైమరీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి అంటూ ఎవరూ లేరు.ఆ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నది. స్వయంగా తన వద్దే విద్యాశాఖ ఉన్నా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని, మాట్లాడితే విద్యావ్యవస్థను సమూళంగా మార్చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానని చెబుతుంటారని, ఇలా వ్యవహరిస్తే విద్యావ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందని విమర్శలు వస్తున్నాయి.

తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న తమకు అది కూడా సకాలంలో అందకపోవడంపై ప్రీ ప్రైమరీ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి వేతనం రాకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పెండింగు వేతనాలు విడుదల చేయడంతో పాటు ఇకపై ప్రతినెలా సకాలంలో వేతనం చెల్లించాలని ప్రీ ప్రైమరీ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.

#pre primary schools#no salaries#teachers#attenders#Telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి