తెలంగాణ
TG : సమ్మక్క సాగర్‌కు మోక్షం లభించనుందా?
కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీ కట్టడం ఎప్పుడో పూర్తయింది.. కానీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఒక్క ఫర్మిషన్ రాక అందులో నీళ్లు నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ సాగునీటి రంగంలో పెండింగ్‌లో ఉన్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపిస్తోంది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ఫలించింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో వీరు జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో, ఎన్ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
