పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు కాల్

GVK Mall: హైదరాబాద్ పంజాగుట్ట జీవీకే మాల్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. జీవీకే మాల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది మాల్ కు చేరుకున్నారు. మాల్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాల్ లోని అణువణువు చెక్ చేస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించి పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్ చేసింది ఎవరు? ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు సేకరిస్తున్నారు.