డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీలిమిటేషన్ బిల్లు విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. డీలిమిటేషన్ పై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందన్నారు. బిల్లుకు అనుకూలంగా తమ ముగ్గురు ఎంపీలు ఓటు వేస్తారని చెప్పారు. దక్షిణ భారతదేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండకూడదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
