సినిమా
BIG Breaking: స్వీట్ సర్ప్రైజ్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదే!
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతుల జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 19వ తేదీ గురువారం సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ మధురమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
