తెలంగాణ

TG: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశం!

TG: తెలంగాణలోని సుమారు 7 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని, తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా పెట్టిన లబ్ధిదారులకు వాటిని తిరిగి ఇచ్చేయాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా నేరుగా ప్రయోజనం కలగనుందని ఆయన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల ద్వారా నిధులు అందించేవారు. అయితే, బ్యాంకు రుణాల కోసం అప్పట్లో లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వ వద్ద తనఖా పెట్టాల్సి వచ్చింది. రూల్స్ ప్రకారం రుణ వాయిదాలన్నీ కట్టేసిన తర్వాత ఆ పట్టాలను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి. కానీ, వివిధ కారణాల వల్ల లక్షలాది మందికి చెందిన ఆ విలువైన పత్రాలు ఇప్పటికీ తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.