తెలంగాణ

TG: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశం!

4 నిమిషాల పఠనం

TG: తెలంగాణలోని సుమారు 7 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని, తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా పెట్టిన లబ్ధిదారులకు వాటిని తిరిగి ఇచ్చేయాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.

TG: తెలంగాణలోని సుమారు 7 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని, తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా పెట్టిన లబ్ధిదారులకు వాటిని తిరిగి ఇచ్చేయాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా నేరుగా ప్రయోజనం కలగనుందని ఆయన వెల్లడించారు.

అసలు ఈ పట్టాల కథేంటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల ద్వారా నిధులు అందించేవారు. అయితే, బ్యాంకు రుణాల కోసం అప్పట్లో లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వ వద్ద తనఖా పెట్టాల్సి వచ్చింది. రూల్స్ ప్రకారం రుణ వాయిదాలన్నీ కట్టేసిన తర్వాత ఆ పట్టాలను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి. కానీ, వివిధ కారణాల వల్ల లక్షలాది మందికి చెందిన ఆ విలువైన పత్రాలు ఇప్పటికీ తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.

22ఏ సమీక్షలో బయటపడ్డ అసలు విషయం..

ఇటీవల రాష్ట్రంలో 22ఏ భూ వివాదాలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినప్పుడు, తహసీల్దారు ఆఫీసుల్లో లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు మూలుగుతున్న విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వచ్చింది. అప్పులు తీర్చేసినా సరే, సొంత ఇంటి కాగితాలు చేతిలో లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన రేవంత్ సర్కార్ వెంటనే స్పందించింది. తహసీల్దారు కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఆ పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లన్నింటినీ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అసలు లబ్ధిదారులకు అందజేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏళ్ల తరబడి సొంత ఇంటి పత్రాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు ఇది నిజంగా పండగ లాంటి వార్త.

#Telangana News#Revanth Reddy Government#Telangana Government#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి