తెలంగాణ

ఇంటర్ 2027 టైమ్ టేబుల్.. ప్రాక్టికల్స్, మెయిన్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే!

తెలంగాణ ఇంటర్మీడియట్ (IPE) 2027 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. అయితే మెయిన్ ఎగ్జామ్స్ కంటే ముందే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రాక్టికల్స్, అసెస్‌మెంట్లు వరుసగా ఉండటంతో విద్యార్థుల్లో సందడి మొదలైంది.ప్రాక్టికల్స్, ఇంటర్నల్ పరీక్షల తేదీల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. జనవరి 20 నుంచి 25 వరకు ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 27న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో జనవరి 29న ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, జనవరి 30న సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో సహా ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) సాగుతాయి.