TG: తెలంగాణ జర్నలిస్టులకు జాతీయ స్థాయి గుర్తింపు.. ఐజేయూ కౌన్సిల్లో ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు!
TG: జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కౌన్సిల్లో తెలంగాణ జర్నలిస్టులకు అరుదైన గౌరవం దక్కింది. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా తిరుపతి నాయక్ మాలోత్, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జాకట రాకేష్ ఎంపికయ్యారు. వృత్తిపరమైన గౌరవం, జర్నలిస్టుల రక్షణ కోసం పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మక యూనియన్లో వీరికి కీలక పదవులు లభించడంపై పాత్రికేయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.తమ ఎంపిక పట్ల తిరుపతి నాయక్ మాలోత్, జాకట రాకేష్ ఆనందం వ్యక్తం చేశారు. తమపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, యూనియన్ సలహాదారు క్రాంతి కిరణ్తో పాటు ఇతర నాయకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
