తెలంగాణ

TG: తెలంగాణ కార్మిక శాఖలో ‘ఓఎస్డీ’ రాజ్యం.. బావమరిదికి సీఈఓ పీఠం, ఈడీ కేసుల నిందితులకు క్లీన్‌చిట్?

TG: తెలంగాణ కార్మిక శాఖలో ఇప్పుడు అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. రూల్స్ ప్రకారం నడవాల్సిన ప్రభుత్వ శాఖలో, మంత్రి కార్యాలయానికి చెందిన ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పెత్తనం మితిమీరిందన్న ఆరోపణలు సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అర్హతలు, సీనియారిటీని పక్కనపెట్టి తన బంధువులకు, తనకు కావాల్సిన వారికి కీలక పదవులు కట్టబెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ వివాదంలో అన్నింటికంటే సంచలనంగా మారిన అంశం బంధుప్రీతి. ఐఎంసీ బోర్డు సీఈఓగా తన సొంత బావమరిది ప్రమోద్ రెడ్డిని నియమించేందుకు ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు శాఖలో జోరుగా చర్చ నడుస్తోంది.