తెలంగాణ
Telangana Politics: ఇక కవితకు కౌంటర్లే.. ఆ భయంతోనే రూట్ మార్చిన బీఆర్ఎస్!
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొత్తగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత, ఇన్నాళ్లూ బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నా గులాబీ పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇకపై కవిత వేసే ప్రతి బాణానికి అంతే బలంగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం డిసైడ్ అయింది. అసలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గులాబీ దళం, సడన్గా ఎందుకు రూట్ మార్చింది? దీని వెనుక ఉన్న ఆ భయం ఏంటో తెలుసుకుందాం.ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల కంటే కవిత నుంచే బీఆర్ఎస్కు ఎక్కువ సెగ తగులుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
