TG: సింగిల్ విండో విధానంలో పౌల్ట్రీ పరిశ్రమకు అనుమతులు- సీఎం రేవంత్ రెడ్డి
TG: తెలంగాణలో పౌల్ట్రీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఎలాంటి జాప్యం లేకుండా 'సింగిల్ విండో విధానం' ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 'పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో' వేదికగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులకు ఎంతో సమయం ఆదా కానుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'లో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
