TG: ప్రశ్నిస్తే రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు పోస్టు తొలగిస్తారా.. సజ్జనార్‌పై సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదు?
TG: తెలంగాణ పోలీసు శాఖలో ఇప్పుడు ఒక సోషల్ మీడియా వివాదం పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఉద్దేశించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు పెట్టిన ఒక పోస్ట్, దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తొలగించేలా చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకున్నామని పోలీసు వర్గాలు చెబుతుండగా, మరోవైపు ఆరోపణలపై విచారణ జరిపించకుండా ఇలా పోస్టులు డిలీట్ చేయించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.నాలుగు రోజుల క్రితం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు ఎక్స్ వేదికగా సజ్జనార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సజ్జనార్ 'యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్' అంటూ ఆయన నేరుగా ఒక పోస్ట్ పెట్టారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, అభ్యంతరకరంగా ఈ కామెంట్స్ ఉన్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావించారు.
