స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Telangana : బరితెగిస్తున్నకాంగ్రెస్! భరిస్తోన్న తెలంగాణికం..
హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితేనే తన కుటుంబం మనుషులకు జరిగినట్లు ఫీల్ అయి కాపాడటం తెలంగాణ కల్చర్. కానీ, దాడులతో ఆ కల్చర్‌ను కాంగ్రెస్ నేతలు పాడు చేస్తున్నారు. సమాజం స్పృహ నూరిపోసిన వారిని ప్రొత్సహించిన సీఎం రేవంత్ రెడ్డి, దాడులను సైతం వెనకేసుకొస్తున్నారు. పైగా వాటిని ఉద్యమాల్లో జరిగిన దాడులతో పోల్చుతున్నారు. దీనిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ మెటా కంపెనీపై దాడి చేయడం, వాళ్లకు వెంటనే బెయిల్స్ ఇప్పించడం అంటే కార్పొరేట్ కంపెనీలు ఎందుకు? సెజ్ భూములు ఇవ్వడం ఎందుకు? ఆ యాక్ట్స్ ఎందుకు పనికి రావని చెబుతున్నారు. మెటా లాంటి సంస్థలోనే అలా జరిగితే రేపు అన్ని సాప్ట్వేర్ కంపెనీల్లో మోసాలు జరిగాయని ప్రతి ఒక్కరూ దాడి చేయొచ్చు.
