వైరల్ న్యూస్
Viral : సింహాన్ని వెంబడించి జాబ్స్ కోల్పోయారు!
సింహాన్ని చూస్తే చాలు కొందరిలో వణుకు పుడుతుంది. ఎక్కడ అటాక్ చేసి చంపేస్తుందో అని ప్రాణభయంతో దగ్గిరికి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. సింహం గర్జన వింటేనే మరికొందరికి గుండెలు ఆగుతాయి. జంతువులను వేటాడే సింహానికి ఎదురుగా వెళ్లేందుకు ఎవరూ సహసించరు. ఒక్కసారిగా పంజా విసిరింది అంటే పైకి లేవడం కూడా చాలా కష్టం. అలాంటిది ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగులు సింహాన్ని వెంబడించారు. అది కూడా ద్విచక్ర వాహనాలపై సింహానికి సమీపంగా వెళ్లి పరిగెత్తించారు.దీంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గుజరాత్లోని అమ్రేలీ జిల్లా, ధారి గిర్ ఈస్ట్ డివిజన్లో ఉన్న అంబర్డి సఫారీ పార్కులో వెలుగుచూసింది.
