వైరల్ న్యూస్

Viral : సింహాన్ని వెంబడించి జాబ్స్ కోల్పోయారు!

4 నిమిషాల పఠనం

సింహాన్ని చూస్తే చాలు కొందరిలో వణుకు పుడుతుంది. ఎక్కడ అటాక్ చేసి చంపేస్తుందో అని ప్రాణభయంతో దగ్గిరికి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. సింహం గర్జన వింటేనే మరికొందరికి గుండెలు ఆగుతాయి. జంతువులను వేటాడే సింహానికి ఎదురుగా వెళ్లేందుకు ఎవరూ సహసించరు.

సింహాన్ని చూస్తే చాలు కొందరిలో వణుకు పుడుతుంది. ఎక్కడ అటాక్ చేసి చంపేస్తుందో అని ప్రాణభయంతో దగ్గిరికి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. సింహం గర్జన వింటేనే మరికొందరికి గుండెలు ఆగుతాయి. జంతువులను వేటాడే సింహానికి ఎదురుగా వెళ్లేందుకు ఎవరూ సహసించరు. ఒక్కసారిగా పంజా విసిరింది అంటే పైకి లేవడం కూడా చాలా కష్టం. అలాంటిది ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగులు సింహాన్ని వెంబడించారు. అది కూడా ద్విచక్ర వాహనాలపై సింహానికి సమీపంగా వెళ్లి పరిగెత్తించారు.దీంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా, ధారి గిర్ ఈస్ట్ డివిజన్‌లో ఉన్న అంబర్డి సఫారీ పార్కులో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ‘సింబా’ అనే సింహం తన ప్రదేశం నుంచి తప్పించుకొని మరో ప్రదేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ విషయం తెలిసి అటవీశాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. దాన్ని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి పంపించేందుకు మోటార్ సైకిళ్లపై అటవీశాఖ సిబ్బంది ఛేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జీపులో వెళ్లడానికి బదులు మోటార్ సైకిళ్లపై అటవీ శాఖ సిబ్బంది వెళ్లడాన్ని తప్పుపడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అది కూడా సింహానికి సమీపానికి వెళ్లి ఎలా తిరిగి పంపుతారని, ఒక్కసారిగా మీద ఎటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు.ఫారెస్టు సిబ్బంది సేఫ్టీ మెజర్స్ కూడా పాటించలేదని ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. క్రూర మృగాలతో ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ పలువురు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా మోటార్ సైకిళ్లపై సింహాన్ని తిరిగి తన ప్రదేశానికి పంపించేందుకు ప్రయత్నించిన ఫారెస్టు సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగంలో నుంచి అధికారులు తొలగించినట్టు సమాచారం.

#Lion#chasing#bikers#forest employees#gujrath#video viral#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి