క్రైమ్

Road Accident : ఇద్దరు మహిళా టీచర్లను కబళించిన టిప్పర్..

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు ప్రమాదానికి గురికావడం సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. టిప్పర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో సిబ్బంది, విద్యార్థులు సైతం షాక్‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెం సమీపంలో చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. విధులు ముగించుకుని ఒకే స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళా టీచర్లు రజిత, రక్మ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జిల్లాలోని చివ్వేంల మినీ గురుకుల పాఠశాలలో రజిత (ప్రిన్సిపాల్‌), రక్మ (టీచర్‌)గా పనిచేస్తున్నట్టు సమాచారం.ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు మృత్యువాత పడటంతో పై అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.