Horoscope : నేటి పంచాంగం (25 నవంబర్ 2026) రాహుకాలం గడియలు
కొందరు ఏదైనా శుభకార్యం తలపెట్టేందుకు శుభగడియలు చూడటం అలవాటు. ఉదయం లేవగానే ఇవాళ రాహుకాలం, వర్జ్యం ఏ సమయానికి ఉందో చూస్తుంటారు.దాని ప్రకారమే కార్యాలు తలపెడుతుంటారు. అలా చేయడం వలన మొదలెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతుంటారు. నక్షత్రాలు, జాతకాల ప్రకారం నడుచుకుంటే రోజులు కలిసి వస్తాయని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని, అనారోగ్య సమస్యలు దరిచేరవని విశ్వసిస్తుంటారు. మంచి ముహూర్తంలో పని మొదలుపెడితే అంతా శుభమే జరుగుతుందనే బలమైన నమ్మకం కొందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిసింది. అలాంటి వారి కోసం ఇవాళ్టి పంచాంగం వివరాలు..
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణ పక్షంలో సాయంత్రం 04:50 వరకు పాడ్యమి, తదుపరి విదియ తిథులు ఉన్నాయి. రాత్రి 08:36 వరకు రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర నక్షత్రం కొనసాగుతాయి. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 01:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:25 వరకు ఉండగా.. సాయంత్రం 05:46 నుండి రాత్రి 07:10 వరకు అమృత ఘడియలు శుభప్రదంగా ఉన్నాయి.
