వైరల్ న్యూస్
Viral: వారెవ్వా.. 40మంది బౌన్సర్ల మధ్య ‘గుర్రం’ గ్రాండ్ ఎంట్రీ!
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతరలో ఓ దృశ్యం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా దేశాధినేతలు, వీఐపీలు, అగ్ర సినీ తారలకు మాత్రమే కనిపించే భారీ బౌన్సర్ల భద్రతను, అక్కడ ఒక మేలుజాతి గుర్రానికి ఏర్పాటు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 'బాదల్' అనే అందమైన తెల్ల గుర్రం ఏకంగా 40మంది బౌన్సర్ల పటిష్ట భద్రతా వలయం మధ్య రాజసంగా మేళా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
