వైరల్ న్యూస్

Viral: వారెవ్వా.. 40మంది బౌన్సర్ల మధ్య ‘గుర్రం’ గ్రాండ్ ఎంట్రీ!

4 నిమిషాల పఠనం

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతరలో ఓ దృశ్యం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా దేశాధినేతలు, వీఐపీలు, అగ్ర సినీ తారలకు మాత్రమే కనిపించే భారీ బౌన్సర్ల భద్రతను, అక్కడ ఒక మేలుజాతి గుర్రానికి ఏర్పాటు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతరలో ఓ దృశ్యం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా దేశాధినేతలు, వీఐపీలు, అగ్ర సినీ తారలకు మాత్రమే కనిపించే భారీ బౌన్సర్ల భద్రతను, అక్కడ ఒక మేలుజాతి గుర్రానికి ఏర్పాటు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 'బాదల్' అనే అందమైన తెల్ల గుర్రం ఏకంగా 40మంది బౌన్సర్ల పటిష్ట భద్రతా వలయం మధ్య రాజసంగా మేళా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

 అజ్మీర్ జిల్లా కేక్రీ ప్రాంతానికి చెందిన ప్రముఖ పశుపోషకుడు రాహుల్ జేత్వాల్.. తానెంతో ఇష్టంగా పెంచుకుంటున్న 'బాదల్' గుర్రాన్ని ఈసారి పుష్కర్ జాతరకు తీసుకువచ్చాడు. స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు సంప్రదాయ డోలు వాయిద్యాలు మార్మోగుతుండగా, యజమాని రాహుల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నోట్ల వర్షం కురిపిస్తూ గుర్రాన్ని వేదిక వద్దకు నడిపించాడు. సందర్శకులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో జాతర ప్రాంతంలో ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

 యజమాని రాహుల్ జేత్వాల్ తన వెంట 'బాదల్' తో పాటు 'న్యూ బాదల్', 'విశ్వాస్' అనే మరో రెండు అరుదైన మేలుజాతి గుర్రాలను కూడా ఈ జాతరకు తీసుకువచ్చారు. కేవలం 24నెలల వయసున్న బాదల్ ఎత్తు 5.5అడుగులకు పైగానే ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మూడు విలువైన అశ్వాల మొత్తం మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 గతేడాది ఇదే ప్రత్యేక జాతికి చెందిన మరో గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఏకంగా రూ.11కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ, యజమాని అమ్మడానికి అంగీకరించలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇంతటి అమూల్యమైన, అరుదైన జాతి గుర్రాలు కావడంతో వాటికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకే యజమాని ఈ స్థాయిలో బౌన్సర్లతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

#PushkarMela2026HorseEntry#BadalHorse40BouncersSecurity#AjmerPushkarFairViralVideo#5CroreHorsesPushkarMela#ViralNewsTelugu#NationalNewsTelugu#HydNewsTelugu#BreakingNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి